Accident | హుజురాబాద్ రూరల్, జూన్22 : హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామ సమీపంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం ఐస్ క్రీమ్ ఆటో ట్రాలీని గుర్తు తెలియని లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాలీ బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.
స్థానికుల కథనం ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడు ట్రాలీలో తుమ్మనపల్లి సమీపంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారి పక్కన గత కొన్ని నెలలుగా ఐస్ క్రీమ్ విక్రయిస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో హుజురాబాద్ నుండి ట్రాలీని తీసుకువచ్చి రోజు పార్కింగ్ చేసే స్థలంలో నిలుపుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టి వెళ్లిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఢీ కొట్టి వెళ్లిన లారీ గురించి సీసీ పుటేజీల ఆధారంగా ఆరాతీస్తున్నారు.