Amma Mata-Anganwadi bata | రుద్రంగి, జూన్ 11: రుద్రంగి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం-2 పరిధిలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత అధ్వర్యంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు బుధవారం అమ్మమాట-అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువగా సమగ్రాభివృద్ధి ఉంటుందని, కావున ప్రాథమిక పాఠశాలకు ముందు పూర్వ ప్రాథమిక విద్యను చిన్నారులకు అందించాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్యా అందించడంతో పిల్లల్లో శారీరక అభివృద్ధితో పాటు మానసిక అభివృద్ధి పెరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల ద్వారా ప్రత్యక్ష అనుభవాల ద్వారా చిన్నారులు నేర్చుకుంటారన్నారు. చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో యూనిఫామ్స్, ఫ్రీస్కూల్ బుక్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు మంజుల, జ్యోతి, సరిత, శారద, కవిత, అనసూయ, పద్మ, నీల, అరుణ, అంజలి, రజిత, సువర్ణ, నీలిమ, వసంత, సుమితలతో పాటు తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.