Reunion | మానకొండూర్ రూరల్, జులై 27 : 50 ఏండ్ల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు ఒకచోట గుమిగుడి వారి చిన్ననాటి మధురస్మతులను నెమరేసుకున్నారు. మానకొండూర్ మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో 1975-76 సంవత్సరం పదవ చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ముంజంపల్లి ఆత్మీయ సమ్మేళన కార్య క్రమాన్ని నిర్వహించారు. మొదటగా ప్రాంగణానికి చేరుకున్న వారందరూ కలిసి సరస్వతీ ప్రార్ధన చేసి, పరిచయాన్ని కార్యక్రమాన్ని చేశారు. నాటి మిత్రులు కొందరు మరణించినందున వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.
నాటి మరువలేని మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఆపదలో ఉండే వారి కుటుంబాలకు అండగా ఉండాలని, వారిని కాపాడుకునే బాధ్యతను మనమే చేపట్టాలని ప్రతిన భూనారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి నాగరాజు, రిటైర్డ్ ఉపాద్యాయులు సింగిరెడ్డి ఎల్లారెడ్డి, వేదవాణి, పూర్వ విద్యార్థులు ఉన్నారు.