కరీంనగర్ కమాన్చౌరస్తా, మే 17 : ఎప్సెట్-2026 ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయం సాధించారని, కరీంనగర్ చరిత్రలో కనీవినీ ఎరగని ర్యాంకులు పొందారని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లి టైనిటాన్స్ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కళాశాలకు చెందిన డీ రిత్విక్ (అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో) రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో.. పీ చరణ్ (ఇంజినీరింగ్ విభాగంలో) 22వ ర్యాంకుతో ద్వితీయ స్థానంలో నిలిచాడని చెప్పారు. 32 మంది విద్యార్థులు వెయ్యి లోపు ర్యాంకు సాధించడం విశేషమన్నారు.
57 మంది విద్యార్థులు 2వేలలోపు ర్యాంకులు, 88 మంది విద్యార్థులు 3వేలలోపు ర్యాంకులు, 127 మంది విద్యార్థులు 4వేలలోపు, 169 మంది విద్యార్థులు 5వేలలోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటారని సంతోషం వ్యక్తం చేశారు. సీహెచ్ లక్ష్మీహాసిని 74, నిదా 157, పీ అక్షయ 251, ఎల్ అర్యన్ రావు 252, మహ్మద్ హుస్సేన్ 272, వీ రుచిత 293, ఏ నాగసింధు 330, బీ అభిఘ్న 430, వీ సుహాసిని 439, వీ శ్రేయస్ రెడ్డి 487, జై నయన్ 505, జీ చైత్ర 506, బీ లిఖిత్సాయి 538, ఎల్ అనంతసాయి 543, కే అక్షిత 555, జీ లాస్యరెడ్డి 614, జీ హర్షిత 637, టీ హర్షిత 697, టీ సహస్ర 739, జే జస్రిత్స సాయి 745, డీ విశ్వతేజ 772, ఎం సిరిమణి 814, సయ్యద్ మలాజొద్దీన్ 836, షరిన్ఫాతిమా 898, కే ధనుష్ 904, పీ చందన 905, ఎన్ జస్వంత్సాయి 921, కే అక్షయ 951, ఎల్ ప్రణయని 954, ఏన్ రత్నప్రకాశ్ 961 వివిధ సబ్జెక్టుల్లో ర్యాంకులతో అఖండ విజయం అందించారని చెప్పారు.
తకువ మంది విద్యార్థులతో అత్యధిక, అత్యద్భుత ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్ విద్యాసంస్థలకు మాత్రమే సాధ్యమన్నారు. ఈ మధ్య ప్రకటించిన ఐఐటీ(మెయిన్స్) ఫలితాల్లో కూడా తమ విద్యార్థులు సత్తా చాటారని గుర్తు చేశారు. 450 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు అర్హత సాధించడం మరో సంచలనమన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషివల్ల ఇంతటి ఘనవిజయాలు సాధిస్తున్నామని స్పష్టం చేశారు.