AllForce Attempt – 2025 | కమాన్ చౌరస్తా, సెప్టెంబర్ 22: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారికి పట్టం కట్టేందుకే ‘ఆల్ఫోర్స్ ఆటెంప్ట్ -2025 ప్రత్యేక పరీక్ష నిర్వహించినట్లు ఆ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ టైనీ టాట్స్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అటెంప్ట్-25’ పరీక్ష ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యార్థులకు న్యాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా భారతదేశంలో అత్యుత్తమ అధ్యాపకులచే రెండు సంవత్సరాల పాటు ఐఐటి, నీట్ లో అత్యుత్తమ శిక్షణ పొందడానికై ప్రోత్సాహకాలను అందించడానికి ఈ పరీక్షను తెలంగాణ రాష్ట్రంలోని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో నేడు చాలా వేడుకగా నిర్వహించడం సంతోషంగా ఉన్నదన్నారు. రెండు రోజుల్లో ఈ ఫలితాలను ప్రకటించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలతో పాటు విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన పరీక్షకు 684 విద్యార్థులు మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, వివిధ పాఠశాలల యజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.