Veernapally | వీర్నపల్లి , ఆగస్టు 21: ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో నిత్యం ఆ దారి గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు అదుపుతప్పి కిందపడిన ఘటనలు ఉన్నాయి. దీంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించిన రోడ్డు బాగు చేయించక పోవడంతో గ్రామస్థులే ముందుకు వచ్చారు.
తమ ట్రాక్టర్లతో కంకర, మట్టి తీసుకొచ్చారు. బురదమాయంగా ఉన్న రోడ్డుపై పోసి మరమ్మత్తు చేయించారు. ఇక్కడ ఏఎంసీ వైస్ చైర్మన్ లెంకల లక్ష్మణ్ , డైరెక్టర్ పెడతనపల్లి చంద్రమౌలి, మాజీ ఉపసర్పంచ్ బోయిని రవి , నాగరపు బాలరాజు, నాగరపు లింబాద్రి , తదితరులు ఉన్నారు. రోడ్డు బాగు చేయించిన గ్రామస్తులకు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.