PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్ 27( నమస్తే తెలంగాణ) : స్వపరి పాలన కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిన్నర పాటు సాగిన కాంగ్రెస్ అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుతున్నారని, మళ్లీ కేసీఆర్ పాలనే కావాలని యావత్ తెలంగాణ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద ఆయన చలో ఎల్కతుర్తి సభకు తరలి వెళ్లేందుకు నాయకులు పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు వాహనాల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని యావత్ ప్రజలను కదిలించి ఒక్కడిగా బయలుదేరిన ఉద్యమనేత కేసీఆర్ వెంటనే అన్నారు. ప్రజలను ఆకాంక్షను నెరవేర్చి పదేళ్ల పాలనము అద్భుతంగా కొనసాగిస్తే అలాగే కానీ హామీలతో ప్రజలను నట్టేట ముంచినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది నెలలోనే యావత్ ప్రజల చిత్కారానికి లోనైయిందన్నారు.
ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్కు గట్టి గుణపాఠం చెప్పేందుకు యావత్ తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణలో సుభిక్షం చేస్తుందనేది సుస్పష్టమైదన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఎల్కతుర్తి సభ చారిత్రాత్మక సభ కానున్నారు. మహాకుంభమేళా తరహాలో యావత్ తెలంగాణ తరలివచ్చి సభ విజయవంతానికి కదలి వెళుతున్నారని పేర్కొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ మాజీ మేయర్ నడిపెల్లి అభిషేక రావు, నాయకులు పెంట రాజేష్, చలకలపల్లి శ్రీనివాస్, సంధ్యారెడ్డితో పాటు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు.