కమాన్ చౌరస్తా : విద్యారంగ అభివృద్ధిలో విద్యార్థి సంఘాల పాత్ర చాలా కీలకమైందని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి అన్నారు. గురువారం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వచ్చే నెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర విసృ్తత స్థాయి సమావేశాల పోస్టర్ను ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆయన వావిలాలపల్లిలోని జూనియర్ కళాశాలలో ఆవిషరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులపై ప్రభుత్వాలు, విద్యాసంస్థల యజమాన్యాలతో చర్చించడంలో విద్యార్థి సంఘాల పాత్ర కీలకమైందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర చర్చలు జరిపి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను భారతదేశం పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి పరచాలన్నారు. విద్యారంగంపై పరిశోధనలు పెంపొందించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంద గణేష్, రాహుల్, నాయకులు సంపత్, గణేశ్, అరుణ్, నితిన్, గీతాంజలి, వంశీ రమేష్ పాల్గొన్నారు.