Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
Akada Demonstrations | సాంప్రదాయ యుద్ధ కళలలో ఒకటైనా అకాడ ప్రదర్శనలు గోదావరిఖని లో విశేషంగా ఆకట్టుకున్నాయి.
కోల్ సిటీ : సాంప్రదాయ యుద్ధ కళలలో ఒకటైనా అకాడ ప్రదర్శనలు ( Akada Demonstrations ) గోదావరిఖని ( Godavarikhani ) లో విశేషంగా ఆకట్టుకున్నాయి. మాజీ జడ్పీ సభ్యురాలు కందుల సంధ్యారాణి (Sandhyarani ) కర్రసాము, కత్తి సాము తదితర యుద్ధ విన్యాసాలను ప్రదర్శించి అదరగొట్టారు.
విజయదశమి సందర్భంగా గోదావరిఖని విద్యానగర్ లోని జై భారత్ హనుమాన్ అకాడ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. వస్తాద్ లు మచ్చ శంకర్, జాఫర్ నేతృత్వంలో కళాకారులు, చిన్నారులు విద్యానగర్ నుంచి స్థానిక కోదండ రామాలయం వరకు దారి పొడవునా సాహస విన్యాసాలను ప్రదర్శించారు.

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డెపల్లి రాంచందర్ ముఖ్యతిథిగా హాజరై ఈ ప్రదర్శనల ను ప్రారంభించారు. అతిథులు మాట్లాడుతూ 40 యేళ్లుగా గోదావరిఖనిలో సాంప్రదాయ యుద్ధ కళ అకాడకు పురుడు పోస్తూ ప్రతి ఏటా దసరా రోజున ప్రదర్శనలు ఇవ్వడం అభినందనీయమన్నారు. అంతరించిపోతున్న యుద్ధ కళను రక్షిస్తున్న వస్తాద్ లను అభినందించారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు కందుల సంధ్యారాణి పోషం, చిలుక. భారతి, ఆసంపల్లి వాసు, గాలిపల్లి తిరుపతి, కెప్టెన్లు కండె సమ్మయ్య, శ్రీనివాస్, మచ్చ విశ్వాస్, దామోదర్, జనగామ శ్రీనివాస్ తోపాటు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

