Sultanabad | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 19: నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగే మూలమలుపు రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఎన్నిసార్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి ప్రయోజనం లేదని పలువురు వాపోయారు.
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజు పల్లి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయ సమీపంలోని రోడ్డు కల్వర్టు వద్ద వర్షాలకు దెబ్బతిని తారు రోడ్డు అంచులకు తెగుకుంటూ రావడం వల్ల దెబ్బ తింది. ఐతరాజు పల్లి నుంచి భూపతిపూర్ గ్రామం వైపు, అలాగే ఎలిగేడు మండలంలోని సుల్తానాపూర్ వైపు వెళ్లే దారి మూలమలుపు ఉండడం దానికి తోడు రోడ్డు అంచులు దెబ్బ తినడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందని ద్విచక్ర వాహనదారులతోపాటు భారీ వాహనదారులు, రైతులు సైతం వారి పంట పొలాలకు ఆధార వైపు నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కల్వర్టు వద్ద బండలతో నిర్మించి రోడ్డు మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.