Agniveer | చిగురుమామిడి, మే 29: మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పిక్కాల అనిల్ పంజాబ్ బెటాలియన్ లో అగ్నివీర్ జవాన్ గా చేరి ఇండియా పాక్ సరిహద్దుల్లో సైనిక సేవలు అందించారు. రెండు రోజుల క్రితం సొంత ఊరు రేకొండకు రావడంతో గ్రామస్తులు జవాన్ అనిల్ ను గురువారం గ్రామస్తులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
దేశం కోసం సరిహద్దుల్లో చేస్తున్న సేవలను గ్రామస్తులు కొనియాడారు. సన్మానించిన వారిలో దొడ్ల రమణారెడ్డి, కొత్తూరు రమేష్, పీరల్ల బీరయ్య, కానవేణి శ్రీనివాస్, దొడ్ల వెంకటరెడ్డి, బండారి మల్లేష్, విలాసాగరం సహదేవ్, అరిగెల శ్రీధర్, అన్న కొమురయ్య, బండి తిరుపతి తదితరులున్నారు.