vemulawada | విరాసత్ కోసం 15 నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితుడి ఆందోళన
వారసత్వంగా వచ్చిన భూమిని అన్నదమ్ముల పేరిట విరాసత్ చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకొని 15 మాసాలుగా తిరుగుతున్న పనులు కాకపోవడంతో వేములవాడ ఆర్డీవో ఎదుట బాధితుడు బైఠాయించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
- ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బాధితుడు రాజేశం
- కార్యాలయం ఏవో స్వరూప హామీతో విరమణ
vemulawada | వేములవాడ, జూలై 10 : వారసత్వంగా వచ్చిన భూమిని అన్నదమ్ముల పేరిట విరాసత్ చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకొని 15 మాసాలుగా తిరుగుతున్న పనులు కాకపోవడంతో వేములవాడ ఆర్డీవో ఎదుట బాధితుడు బైఠాయించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బాధితుడు ఒగ్గు రాజేశం మాట్లాడుతూ కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో సర్వేనెంబర్ 245లో వారసత్వంగా వచ్చిన ఎకరం 10 గుంటలు భూమి తల్లి మరణించిన తర్వాత నలుగురు అన్నదమ్ముల పేరిట విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. మార్చి 2025 సంవత్సరంలో దరఖాస్తు చేసుకోగా 15 మాసాలుగా తిరుగుతున్న ఏదో కారణం చెప్పి వాయిదా వేస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సర్వే నెంబర్ లో మొత్తం తొమ్మిది ఎకరాలు ఉండగా ఇందులో ఇద్దరికీ మాత్రం 8 మాసాల కిందటే పట్టాలు చేశారని అన్నారు. మాకు మాత్రం పనిచేయడం లేదంటూ సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే స్పందించి పనులు చేయాలని ఆదేశించిన ఒక్క అడుగు కూడా ముందుకు కదలకుండా ఉన్నందునే తాను కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదనతో తెలిపారు. చివరకు ఏవో స్వరూప చేరుకొని చెక్ లిస్టులో చిన్న సమస్య ఉన్నందున తక్షణమే అందించాలని మండల తహసీల్దార్ అధికారులను ఆదేశించామని తద్వారా సోమవారం పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు నిరసన విరమించారు. కార్యాలయంలో వందల కొద్ది భూభారతి సమస్యలతో కూడిన పనుల దరఖాస్తులు ఉన్నాయని వాటిని చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతోని బాధిత రైతులు అసహనానికి గురవుతున్నారని రాజేశం తెలిపిన నిరసన ద్వారానే అర్థమవుతోందని పలువురు పేర్కొంటున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

