కమాన్‌చౌరస్తా, జనవరి 28 : ట్రస్మా కరీంనగర్ జిల్లా, నగర కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ట్రస్మా రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్ యాదగిరి శేఖర్ రావు ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా డాక్టర్ ఈ ప్రసాద్‌రావు, సౌగాని కొమురయ్య వ్యవహరించారు.
ఇందులో జిల్లా అధ్యక్షుడిగా కోరం సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బుర్రన్నగారి రమణారావు, కోశాధికారిగా రంగు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ముసిపట్టు తిరుపతిరెడ్డి ఎన్నికయ్యారు. నగర అధ్యక్షుడిగా రావుల నరేశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా బొమ్మ శ్రీనివాస్ గౌడ్, కోశాధికారిగా బండ శ్రీకాంత్, జాయింట్ సెక్రెటరీగా మహ్మద్ ఖలీద్, ఉపాధ్యక్షుడిగా నటరాజ్ ఎన్నికయ్యారు.