Sarangapur | వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి.. జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత
వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, బట్టపల్లి, పోతారం, నాయకపు గూడెం, బీర్పూర్ మండలంలోని బీర్పూర్, నర్సింహులపల్లి, తుంగూర్, కందేనకుంట గ్రామాల్లో అధికారులు ప్రత్యేక గ్రామసభలు గురువారం నిర్వహించారు.
Sarangapur | సారంగాపూర్, జూన్ 8 : వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, బట్టపల్లి, పోతారం, నాయకపు గూడెం, బీర్పూర్ మండలంలోని బీర్పూర్, నర్సింహులపల్లి, తుంగూర్, కందేనకుంట గ్రామాల్లో అధికారులు ప్రత్యేక గ్రామసభలు గురువారం నిర్వహించారు. బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు గ్రామాల్లో వర్షాకాలంలో పారిశుద్య నిర్వహణపై ఆ చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ సందర్భంగా వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికలు, పారిశుద్య నిర్వహణ, ఎలినినో ప్రభావ పరిస్థితుల్లో రైతులు పంటల మార్పిడీ చేసుకోవడం, మ చర్యలు, గ్రామాల్లో ఇంకుడు గంతల నిర్మాణాల ఏర్పాటు, నీటిని పొదుపుగా వాడుకోవడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సమావేశాల్లో బీర్పూర్ మండల ప్రత్యేక అధికారి ప్రకాష్, తహసీల్దార్లు వహిదొద్దిన్, సుజాత, ఎంపీడీఓలు ఎండి సలీం, భీమేష్ ప్రజాప్రతినిధులు చేకూట ఆరుణ శేఖర్, మర్రిపెల్లి అశ్విని, పుష్పనాథ్, మల్యాల జ్యోతి, ఎలమట్ల హరీష్, ఎడ్ల సృజన సుశీన్, హర్షకోట రాజగోపాల్ రావు, కొమిరే నర్సయ్య, ఆయా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

