కమాన్ చౌరస్తా, సెప్టెంబర్ 21 : సినీనటి కృతిశెట్టి జన్మదిన పురస్కరించుకొని కృతి శెట్టి ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు మెగా నరేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పేదలకు పండ్ల పంపిణీ చేశారు. అలాగే అవసరార్థులకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మొక్కల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి లో రోగులకు సుమారు 200 మందికి అల్పాహారంతోపాటు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ రోడ్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం నగరంలోని ఆయుష్ బ్లడ్ బ్యాంకులో సుమారు 20 మందితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని అందించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కృతి శెట్టి సూచనల మేరకు అత్యవసర సమయంలో కరీంనగర్లో రక్త నిల్వలు లేక మెరుగైన వైద్యం కోసం వచ్చిన గర్భిణీ మహిళలు, తల సేమియా చిన్నారుల కోసం, రక్తహీనత ఉన్న పేషెంట్లు, యాక్సిడెంట్ అయిన రోగులకు, రక్తం దొరకక బ్లడ్ బ్యాంకుల్లో తీవ్ర ఇబ్బందులను చూసి క్రీత్తి శెట్టి ఫ్యాన్స్ టీమ్ కరీంనగర్ తరపున రక్తదాన శిబిరం నిర్వహించినట్లు చెప్పారు.
ఇక్కడ మెగా అభిమానులు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రామ్ చరణ్ యువశక్తి ఇంచార్జ్ లయన్ మిడిదొడ్డి కపిల్ మాధవ, చొక్కారపు చంద్రం, కొత్త కొండ కిరణ్ కుమార్, అత్తాపురం తరుణ్, మార్క అభిలాష్,గాలిపెల్లి శ్రీను,మేకల వినోద్ కుమార్. మహమ్మద్ నవీద్, సాయి గౌడ, తోట వేణు, భూక్య ప్రవీణ్, జంగాపల్లి పవన్, సాయి, ప్రవళిక, శ్రీదేవి, కోలిపాక సంతు, తదితరులు పాల్గొన్నారు.