సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 12: తంగళ్లపల్లి మండ లం మండెపల్లిలోని ఐడీటీఆర్ (ఇన్సిట్యూట్ ఆఫ్ డ్రై వింగ్, ట్రైనింగ్ రీసెర్చ్)లో నిరుద్యోగ యువతను చే ర్పించి,డ్రైవింగ్‌లో శిక్షణ అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. సొసైటీ సభ్యులతో చైర్మన్, కలెక్టర్ అనురాగ్ జయంతిఅధ్యక్షతన ఐడీటీఆర్ 6వ వార్షిక సాధారణ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన శిక్షణ కార్యక్రమాలు, సంస్థ పనితీరు, భవిష్యత్తుప్రణాళికలను నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు డ్రైవింగ్‌లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చి,ఉపాధి అవకాశాలు పెంచేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఐడీటీఆర్ సంస్థను ఏర్పాటు చేశారన్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సామర్థ్యం మేరకు బ్యాచ్‌ల ను పెంచి శిక్షణ ఇవ్వాలన్నారు. ఐడీటీఆర్ ఆదాయం పెరిగేలా ప్రాయోజిత శిక్షణ కార్యక్రమాలకుప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తెలంగాణకే మణిమారం ఐడీటీఆర్ అని అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణ,పరిశోధనా కేంద్రం లో శిక్షణ పొందడంతో ఉపాధి
అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లు, స్కూల్ బస్సు ల డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, డ్రైవింగ్‌పై అవగాహన, మెళకువలనునేర్పాలన్నారు.
జేఎన్టీయూ విద్యార్థులతో సహా ఉన్నత డిగ్రీ, జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులను ఐడీటీఆర్కు ఆహ్వానించి, డ్రైవింగ్ ప్రాధాన్యతవివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఐడీటీఆర్ సొసైటీ సెక్రటరీ కేబీ రాఘవన్, కోశాధికారి అనురాగ్ కనున్గో, మెంబల్ లీగల్, ఎస్ఎం సతీశ్, సభ్యులు అమిత్‌జైన్, మీనా ఆర్సీ, రమేశ్, సీతారామ్మూర్తి, ప్రదీప్ కుమార్ శెట్టి, బస్వరాజు కోరాద్ది, నవీన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
బైపాస్ రహదారుల్లో ఫ్లాంటేషన్ పూర్తి చేయాలి
సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 12: సిరిసిల్లలోని మొదటి, రెండో బైపాస్ రహదారుల్లో ప్లాంటేషన్‌ను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మొదటి, రెండో బైపాస్ రహదారులను సందర్శించారు. 15 కిలోమీటర్ల మేర అవెన్యూ ఫ్లాంటేషన్, రహదారి డివైడర్లలో ప్లాంటేషన్ సత్వరమే పూర్తి చేయాలనిసూచించారు. ఆయన వెంట సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ అయాజ్, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సారీ, టూరిజం డీఈఈ సుదర్శన్ తదితరులు ఉన్నారు.