Pegadapally | పెగడపల్లి : విద్యుత్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక ( సీజీఆర్ఎప్-2) చైర్మన్ ఎరుకల నారాయణ స్పష్టం చేశారు.
పెగడపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ ఉప కేంద్రంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలోమంగళవారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీజీఆర్ఎఫ్-2 చైర్మన్ నారాయణ మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని, సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే 1912 నంబరుకు నేరుగా ఫిర్యాదు చేయాలని వివరించారు.
వినియోగదారులు, రైతులు తమ విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని కోరుతూ, రైతుల నుండి పలు సమస్యలపై ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల పరిష్కార వేదిక సభ్యులు రామకృష్ణ, సత్యనారాయణ, రాజగౌడ్, విద్యుత్ ఎస్ఈ సుదర్షన్, డీఈఈ గంగారాం, ఏడీఈ మహెందర్, వెంకటేశ్వర్లు, ఏవో శ్రీనివాస్, ఏఈలు మధు, రాకేష్, సాబ్బంది అజయ్, మహేష్, బాలునాయక్, వెంకటేశం, రాజేందర్, వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.