Jagityal | జగిత్యాలరూరల్, జూన్16 : చెరువు కట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కొడిమ్యాల గ్రామ రైతులు పురుగుల మందు డబ్బాలతో కలెక్టరేట్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. చెరువుకట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే తమకు చావే గతి అని, పురుగులమందే మాకు దిక్కు అని అన్నారు. కొడిమ్యాల గ్రామం కొండాపూర్ శివారులోని బురుకుంట కట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి రైతులు పూల మందు డబ్బాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. గత ఏడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న తమను పట్టించుకోవడంలేదని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఎట్టకేలకు మీ ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు కట్ట మరమ్మతులు చేసేందుకు వచ్చినప్పుడు కట్ట ధ్వంసం చేసిన వ్యక్తి కట్ట మీరు మరమ్మతులు చేస్తే పురుగుల మందు తాగి చస్తానని బెదిరించడంతో అధికారులు తిరిగి వెళ్లారు.
ఒక్కరిద్దరి కోసం మిగతా రైతుల నోట్లో మట్టి కుడతారంటూ అన్నారు. కాగా ఈ విషయమై SI, RDO, SRSP EE, DSP కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారులు ఇద్దరి కోసం పదిమంది రైతులకు అన్యాయం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను దృష్టిలో పెట్టుకొని తమకు న్యాయం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.