Selling textbooks | పెద్దపల్లి కమాన్, జూన్ 9 : నిబంధనలకు విరుద్దంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శారదాకు సోమవారం వినతి పత్రం అందజేశారు.
జిల్లాలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్య హక్కు చట్టం 2009 నిబందనలు తుంగలో తొక్కుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాల మీద పాఠశాలల పేర్లు ముద్రించి, యూనిఫామ్స్ అమ్ముతూ పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మారుచుతున్నాయని ఆరోపించారు.
జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌళిక వసతులు లేక విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సకాలంలో పుస్తకాలు మరియి యూనిఫామ్ అందించాలని డిమాండ్ చేశారు. కో-కన్వీనర్ మారం సందీప్, నాయకులు మోహన్, అరవింద్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు