Vemulawada | అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.. బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకుడు పోతు అనిల్ కుమార్
వేములవాడ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అలాంటి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకుడు పోతు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.
Vemulawada | వేములవాడ, జూన్ 27 : వేములవాడ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అలాంటి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకుడు పోతు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ పాఠశాల ఫీజులు పుస్తకాలు డ్రెస్సుల రూపంలో ఎక్కువ విద్యార్థి నుండి రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తూ వ్యాపార కేంద్రాలుగా మార్చారని ఆరోపించారు.
నిబంధనల ప్రకారం పుస్తకాలు ఇతర వస్తువులు పాఠశాలలో విక్రయించరాదని ఉన్నప్పటికీ వాటిని బేఖాదర్ చేస్తున్నారని ఉన్నారు. మండల విద్యాధికారికి ఫిర్యాదు చేసేందుకు రెండు దఫాలుగా వెళ్లిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయానికి ఫిర్యాదు పత్రం పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకుడు లింగం రాకేష్ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

