Siricilla | ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బూర్ల చంద్రశేఖర్ కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రాజన్న సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం తీర్పు వెలువరించారు.
Siricilla | గాంధీచౌక్ : ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బూర్ల చంద్రశేఖర్ కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రాజన్న సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. 2021 ఏప్రిల్ 4న సిరిసిల్ల పట్టణంలోని భూపతి నగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను అదే కాలనీకి చెందిన నిందితుడు బూర్ల చంద్రశేఖర్ మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత బాలిక ఏడుస్తూ బయటకు రావడంతో బాలిక తల్లి విచారించగా జరిగిన విషయాన్ని బాలిక తెలిపింది. దీంతో లైంగిక దాడి జరిగినట్లు గుర్తించిన బాలిక తల్లి సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా రూ.50 వేల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు ఎస్ఐలు నాయుడు, శ్రవణ్, కానిస్టేబుల్ జనార్దన్లను జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- accused
- court
- Karimnagar
- rape case
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

