పెద్దపల్లి టౌన్, జనవరి 8: ప్రమాదవశాత్తూ లారీ కిందపడినా.. ఆ మహిళ మృత్యుంజయురాలుగా నిలిచింది. లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామానికి చెందిన గుర్రాల తిరుపతి-లక్ష్మి దంపతులు పని నిమిత్తం బుధవారం సాయంత్రం మోపెడ్‌పై కరీంనగర్ వెళ్తున్నారు. పెద్దపల్లి జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. బస్టాండ్ మీదుగా యూటర్న్ తీసుకున్నారు. అంతలోనే ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో దాంతో హైరాన చెందారు. ఈ క్రమంలోనే వీరి వాహనం అదుపు తప్పింది. కరీంనగర్ నుంచి గోదావరిఖనివైపు వెళ్తున్న లారీ ముందుభాగంలో కిందికి దూసుకెళ్లింది. వెంటనే లారీ డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేయగా, అప్పటికే ఆ మహిళ లారీ కింది భాగంలో ఇర్కుకున్నది. భయంతో కేకలు వేసింది. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకొని బయటికి తీయడంతో క్షేమంగా వచ్చింది.