ప్రమాదమని తెలిసినా కొందరు వాహనదారులు పరిమితికి మించి సామగ్రిని తరలిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట కేవలం ఇద్దరిని మోసుకెళ్లే టూవీలర్‌పై ఓ వ్యక్తి ఇలా నాలుగు భారీ సంచులను తీసుకెళ్తూ తాను ప్రమాదపు ప్రయాణం చేయడమే కాకుండా ఇతర ప్రయాణికులకు వణుకు పుట్టించాడు. తమకు ఆ సంచులు ఎక్కడ తాకి ప్రమాదం బారిన పడతామోనని కొద్దిసేపు భయాందోళన చెందారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్