Collector Koya Sri Harsha | పెద్దపల్లి, సెప్టెంబర్6 : పెద్దపల్లి జిల్లాలో ఇసుక లభ్యతపై సర్వే నివేదిక నిర్ణత కాల వ్యవధిలో రూపొందించాని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యతపై మైనింగ్, సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ శనివారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. జిల్లాలో ఇసుక లభ్యతపై రెవెన్యూ శాఖ, మైన్స్ అండ్ జియాలజీ, టీజీఎండీసీ, గ్రౌండ్ వాటర్, అటవీశాఖ, నీటిపారుదల శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా పరిశీలించి సర్వే నివేధిక వచ్చే నెల 1వరకు ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు.
జిల్లా సర్వే రిపోర్టు ఆధారంగా లీజుల అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు లభిస్తాయని, తద్వారా నిబంధనల ప్రకారం సర్వే నివేదిక కట్టుదిట్టంగా తయారు చేయాలన్నారు. ప్రతీ శాఖ సంబంధించిన నివేదికలను ఈ నెల 15 లోపు తనకు అందజేయాలని, తద్వారా తుది నివేదిక అక్టోబర్ 1 నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు శ్రీనివాస్, లావణ్య, శివయ్య, శ్రీనివాస్, బావ్ సింగ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.