DYFI | చిగురుమామిడి, జనవరి 9 : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరచడానికి ప్రత్యేక బడ్జెట్ ప్రభుత్వం కేటాయించి క్రీడాకారుల ప్రతిభను గుర్తించి జాతీయస్థాయిలో ఆడే విధంగా కృషి చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిగురుమామిడి మండల కేంద్రంలో డీవైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఏ భాస్కర్ అధ్యక్షతన క్రీడా పోటీలను శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతీ గ్రామానికి మండలానికి ప్రభుత్వమే క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆధ్వరంలో మండల, జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించి క్రీడాకారుల ప్రతిభను గుర్తించాలని అన్నారు. క్రీడలు నిర్వహించడం వల్ల శారీరకంగా మానసికంగా ఉత్సాహానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ప్రతీ మండలానికి కోచ్ లను ఏర్పాటు చేసి విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వము క్రీడాకారుల ప్రతిభలను గుర్తించకపోవడం వల్ల వార క్రీడల్లో రాణించలేకపోతున్నారని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ శర్మ, అధ్యాపకులు సంపత్, జనార్ధన్ పాల్గొన్నారు.