Chain snatching | కథలాపూర్, అక్టోబర్ 12 : కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామ శివారులో ఆదివారం సినీ ఫక్కీ లో చోరి జరిగింది. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన నాగెల్లి గంగు- బుచ్చయ్య దంపతులు కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో ఆదివారం జరిగిన ఓ ఫంక్షన్ కు హాజరై తిరిగి ఎక్సల్ వాహనం పై వెళుతున్నారు.
తక్కళ్లపల్లి గ్రామ శివారులో వరద కాలువ వద్దకు చేరుకోగానే వెనుక బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు గంగు మెడలో నుంచి రెండు తులాల బంగారు చైన్ ను లాక్కెల్లారు. వారిని వెంబడించిన దొరకలేదన్నారు. ఈ మేరకు బాధితురాలు గంగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ పేర్కొన్నారు.