KARIMNAGAR | చిగురుమామిడి, ఏప్రిల్ 17: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ పండుగకు మహిళలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే సిరాజ్ కోరారు. మండలంలోని ఇందుర్తి గ్రామంలో జన సమీకరణ కోసం గురువారం ఇంటింటా తిరిగి మహాసభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేసి అమలు కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ ప్రభుత్వం కనీసం గ్రామపంచాయతీ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉందన్నారు. రైతుబంధు ఎగ్గొట్టి వచ్చిన మోసపూరిత ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. రజితోత్సవ సభకు భారీ స్పందన లభిస్తుందన్నారు. మండలం నుండి పెద్ద ఎత్తున మహాసభకు తరలి వెళ్తామని సిరాజ్ పేర్కొన్నారు. వీరి వెంట బీఆర్ఎస్ నాయకులు అందే రాజమల్లు, ఎస్.కె ఉప్పర్, తిరుపతి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.