Jagityal | జగిత్యాల ఆగస్టు 9 : అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం ఉపాకర్మ నిర్వహించారు. ఇందులో భాగంగా పంచగవ్యము స్వీకరించారు. కాండ రుషుల హోమం, రుషితర్పణం, తదితర వైదిక క్రతువులు నిర్వహించారు.
వైదిక క్రతులను అన్యారంభట్ల సాంబయ్య శర్మ, సభాపతి తెగుళ్ల సూర్యనారాయణ శర్మ, విషు శర్మ, నిర్వహించారు. కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాద వితరణ మహదాశీర్వచనం చేశారు నూతన వటువులకు మౌంజి కార్యక్రమం చేపట్టారు. ఈ క్రతువు ద్వారా బ్రహ్మచారిలో నిగ్రహ శక్తి పెంపొందుతుందని విశ్వాసం వేదమంత్రాల ఘోషతో శ్రీరామ మందిరం ఆవరణ అంతా మారుమోగింది. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.