Goda Kalyanam | సుల్తానాబాద్ రూరల్, జనవరి 14 : గోదా రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.
అనంతరం ఆలయ చైర్మన్, సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్ దంపతులు గోదా రంగనాయక స్వామి వారికి ఒడి బియ్యం నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వార్డ్ సభ్యులు, వివిధ గ్రామాల నుంచి భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.