chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 14: తెలంగాణ క్రీడా ప్రాంగణం అని బోర్డు ఏర్పాటు చేశారు. లోపల క్రీడా మైదానాలు, క్రీడా సామగ్రి ఉందనుకుంటే మీరు పొరపడినట్లే.. లోపల కంకర కుప్పలు, పశువులకు గడ్డి మేత, ప్రైవేటు వాహనాలు పెట్టుకునేందుకు, వర్షపు నీటితో దర్శనమిస్తున్నాయి.
చిన్న ముల్కనూర్ బస్టాండ్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం పక్కన ఉన్న క్రీడా ప్రాంగణంలో పరిస్థితి ఇది? చాలా గ్రామాల్లో ప్రాంగణాలు క్రీడలు ఆడేందుకు ప్రయోజనకరంగా లేవని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రాంగణాలు నిర్వీర్యం అవుతున్నాయని, అధికారులు క్రీడా ప్రాంగణాలపై దృష్టి సారించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.