కార్పొరేషన్, సెప్టెంబర్ 22: గౌడ కులస్తుల అభ్యున్నతికి అన్ని విధాలుగా సహాయ సహాకారాలు అందిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భరోసానిచ్చారు. శుక్రవారం కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎల్లమ్మ తల్లి ఆలయం పక్కనే మానేరు రివర్ ఫ్రంట్ పనులు సాగుతున్నాయన్నారు. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ప్లాజా ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని అద్భుతంగా చేపట్టాలని సూచించారు. నిర్మాణానికి ఇంకా నిధులు అవసరమైన కూడా మంజూరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
బీసీలను అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ ఎమ్మెల్యే కొడూరి సత్యనారాయణ, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, భూమాగౌడ్, ఐలేందర్‌యాదవ్, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాది గల్లంతు విషాదాంతం