HMWSSB | మానకొండూర్ రూరల్, జనవరి 2 : HMWSSB (హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సవరేజ్ బోర్డ్) రామగుండం నుండి హైదరాబాద్ కు వెళ్లే మెయిన్ లైన్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లి శివారులోని మానేరు వాగు ఒడ్డున పగిలిపోయింది. దీంతో అక్కడ నీరు భారీ ఎత్తున ఆకాశం ఎత్తున ఫౌంటెన్ fountain)ను తలపించేలా ఎగురుతోంది.
ఆ నీటితో దగ్గర ఉన్న తాడిచెట్ల అంత ఎత్తుకుపోయి కింద పడడం జరుగుతోంది. కరెంట్ అధికారులకు సమాచారమివ్వడంతో వ్యవసాయ పొలాల వైపు వెళ్లే విద్యుత్‌ను ముందస్తుగా నిలిపి వేశారు. రామగుండం నుండి హైదరాబాద్ కు వెళ్లే హైదరాబాద్ సిటీలో తాగునీటి సరఫరాకు సంబంధించిన గోదావరి నీరు పైప్ లైన్ పగలడంతో మూడు పైపులైన్లు ఆపివేసినట్లు మరమ్మతులకు చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.