Siricilla | ఎల్లారెడ్డిపేట, జూలై 19: అక్కపల్లికి చెందిన రైతు ముక్క చంద్రయ్యకు చెందిన కాడెద్దు శుక్రవారం రాత్రి పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు బాధితుడు తెలిపాడు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బుగ్గరాజేశ్వర తండాలోని పత్తి చేను వద్ద మేతకోసం కట్టేసి ఇంటికి చేరుకున్నారు.
శుక్రవారం రాత్రి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో ఎద్దును అక్కడ నుంచి తీసుకురాలేదు. ఉదయం వెల్లి చూసేసరికి రూ.60వేల విలువ చేసే ఎద్దు మృతి చెంది ఉంది. దీంతో చంద్రయ్య దంపతులు బోరున విలపించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.