రాజన్న సిరిసిల్ల, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నేతన్నల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభంతో ఆత్మహత్యలు, ఆకలిచావులతో సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది. ‘నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోకండి. కుటుంబాలను రోడ్డున పడేయకండి’ అంటూ గోడల మీద పోలీసులు రాసిన రాతలు కేసీఆర్ మనసును చ లింపజేశాయి. ఉద్యమ కాలంలో సిరిసిల్లకు వచ్చినపుడు నేతన్నల పరిస్థితి చూసి పార్టీ ఫండ్ 50 లక్షలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఉపాధి లేక కు టుంబ పోషణ భారమై అప్పుల కోసం మైక్రో, షే ర్ముల్లా లాంటి ఫైనాన్స్‌ల ఉచ్చులో పడి విలవిలలాడుతున్న నేతన్నలకు అండగా నిలిచారు. కు టుంబ పోషణ కోసం పద్మశాలీ సంక్షేమ ట్రస్టు నుంచి 10 వేలు ప్రతి కార్మికుడికి వడ్డీలేని రు ణాలు అందించేలా చర్యలు తీసుకున్నారు. కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గె లుపొందడం, తెలంగాణ వచ్చిన తర్వాత మున్సిపల్, చేనేత జౌళిశాఖ మంత్రి కావడం సిరిసిల్లకు, నేతన్నలకు మహర్దశ వచ్చింది. కార్మికుల కష్టాల ను దగ్గరుండి చూసిన రామన్న అనేక సంక్షేమ ప థకాలు నేతన్నల కోసం అమలు చేయించారు. ముంబాయి, సూరత్, భీవండీ, షోలాపూర్, ఇచ్చల్కరంజీలకు ఉపాధి కోసం భార్య పిల్లలను వదిలి వలస వెళ్లిన కార్మికులను తిరిగి రప్పించాలన్న ఉద్ధేశ్యంతో బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పించారు.
కార్మికులకు చేతినిండా పని..
ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిం ది. కోటీ చీరల తయారీ కోసం 350కోట్ల ఆర్డర్లు ఏటా ఇస్తూ వస్తున్నది. వస్త్ర రంగంలో ఎంతటి వస్త్రం తయారు చేసినా మీటరకు 2నుంచి 3 మాత్రమే కూలీ వచ్చేది. నెలకు కూలీ 8వేల నుంచి పది వేలకు మించి రాని దుస్థితి. కానీ, స్వరాష్ట్రంలో సర్కారు సిరిసిల్ల కార్మికుల ఆత్మహత్యలు, ఆకలిచావులను నివారించేందుకు మీటరుకు 5.25 చెల్లిస్తున్నది. దాంతో ఒక్కో కార్మికు డు నెలకు 20వేల నుంచి 25వేల దాకా కూలీ పొందుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కల్పించిన చేతి నిండా పని, పనికితగ్గ కూలీ దొరుకుంతున్నందున ఏండ్ల కింద వలస పోయిన కార్మికులంతా స్వస్థలాలకు తిరిగి వచ్చారు. పెరిగిన కూలీ పైసలను సద్వినియోగం చేసుకునేలా కేంద్ర ప్ర భుత్వం రద్దు చేసిన త్రిఫ్ట్ (పొదుపు) పథకాన్ని రా ష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ప్రతి కార్మికుడు చేసిన 8శాతం పొదుపులో మరో 8శాతం ప్రభుత్వం చెల్లిస్తున్నది. మూడేళ్ల కాల పరిధిలో ఉన్న ఈ పథకంతో ఒక్కో కార్మికుడు 60వేల నుంచి లక్ష దాకా చేసిన పొదుపును బట్టి వెనుకేసుని లబ్ధిపొందారు. లక్ష అందుకున్న కార్మికుడు ఇంటి అవసరాలు, కొడుకుల వివాహాలకు ఖర్చులకు ఆదుకున్నాయి. ప్రతి కార్మికుడికి రైతు బీమా మాదిరి నేతన్న బీమా 5లక్షల పథకం అమలు చేస్తూ వారి జీవితాలకు భరోసా కల్పించింది. ప్రభుత్వం అందించిన సహకారం, చేయూతతో ఉరిశాల నుంచి ‘సిరి’సిల్లగా ఖ్యాతిగడిస్తున్నది.
పది శాతం యార్న్ సబ్సిడీ 8.80కోట్లు జమ
వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ఎన్ని పథకాలు అమ లు చేసినా అవి నేరుగా కార్మికులకు అందడం లేద న్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. మున్సిప ల్, చేనేత జౌళిశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని యార్న్ సబ్సిడీ ప్రభుత్వం నుంచి పరిశ్రమకు ఇప్పించారు. బతుకమ్మ చీరలకు వినియోగిస్తున్న యార్న్లో పదిశాతం సబ్సిడీ ఇచ్చి, వాటి నిధులు నేరుగా కార్మికులకు చెందేలా చేసింది. ప నిచేసిన దానికి మాత్రమే కూలీ చెల్లించే వస్త్ర పరిశ్రమలో దేశంలో ఎక్కడా లేని విధంగా పది శాతం యార్న్ సబ్సిడీని అదనంగా మరనేతన్నలకు అందిస్తున్నది. ఒక్కో మీటరుకు 1.42 పైసలు అదనంగా కార్మికుడికి లాభం జరిగేలా చేసింది. దీంతో ఒక్కో కార్మికుడికి చేసిన పనిని బట్టి 25 వేల నుంచి 42వేల వరకు లబ్ధి కలుగుతున్నది. 2018లో అమలు చేసిన ఈ సబ్సిడీ పథకం నిరంతరంగా సాగుతున్నది. తాజాగా 2020సంవత్సరానికి సంబంధించి 8.80కోట్లను ప్రభు త్వం బుధవారం విడుదల చేసింది. జిల్లాలో 5378 మంది మరమగ్గాల కార్మికులకు లబ్ధి కలిగింది.
సంబురాలు
తొలి ఏకాదశి పండగకు ఒక రోజు ముందే బ్యాంకు ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమైనట్లు సెల్ఫోన్లకు మేసేజ్ రావడంతో నేతన్నలు ఆనందంలో మునిగిపోయారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సంబురాలు చేసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని గణేశ్‌నగర్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నా రు. ‘మా బతుకులకు భరోసా కల్పించిన రామన్న సల్లంగుండాలె’ అంటూ అక్కడే ఉన్న అంజన్న ఆలయంలో పూజలు చేశారు.
30వేలు పడ్డయ్
నా పేరు నల్ల సత్యనారాయణ. మాది సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్. తెలంగాణ రాక ముందు సిరిసిల్లలో నేను కాటన్ సాంచాలు నడిపిన. ఎప్పుడత్తదో తెలియని కరెంటు కోసం సాంచాల నడుమ కూసోని ఎదురు చూసేటోళ్లం. తయారైన బట్టకు మార్కెట్‌లేక సాంచాలు బంద్పడ్డయి. చాలా మంది సేట్లు సాంచాలు ఇనుప సామాన్ల కింద అమ్ముకున్నరు. పనిలేక తిండికి గోసై కార్మికులు ఉరేసుకున్నరు. బాకీలు బా గైన నాకు కుటుంబాన్ని ఎల్లదీయలేక గుజరాత్‌లోని సూరత్‌కు 20 ఏం డ్ల కింద పోయిన. అక్కడ రాత్‌పైలీ, దిన్పైలీ చేసినా నెలకు కనీసం 8వేలు కూడా రాలే. భార్యా పిల్లలను వదిలి ఒంటరిగా ఉన్న నేను మళ్ల సిరిసిల్లకు వత్తననుకోలేదు.
తెలంగాణ వచ్చినంక సిరిసిల్ల సాంచాలకు సిరి వచ్చింది. మంత్రి రామన్న జెయ్యవట్టి బతుకమ్మ చీరలు ఆర్డర్లు వచ్చినయ్. ఇక్కడ మంచిగ పనైతందని నాసోపతోళ్లు ఫోన్ చేసిన్రు. ఎనిమిదేండ్ల కింద ఇక్కడికి వచ్చిన. మంచిగ పనిజేత్తే నెలకు 20నుంచి 25వేలు వత్తున్నయ్. యార్న్ సబ్సిడీ దేశంలో ఎక్కడ ఇయ్యరు. ఇక్కడే ఇత్తన్నరు. బ్యాంకులో 30వేలు పడ్డట్లు ఫోన్‌కు ఇయ్యాల్నే మేసేజ్ వచ్చింది. పండుగ పూట పైసలచ్చినందుకు సంతోషమనిపించింది. రామన్న మంచిగుండాలే. ఆయనే మాకు దేవుడు
– నల్ల సత్యనారాయణ, సిరిసిల్ల
దేశంలో ఎక్కడా ఇట్ల ఇస్తలేరు
నేను చిన్నప్పటి సంది సాంచాల పనిజేత్తున్న. ఇన్నేళ్ల సంది ఏనాడూ నెలకు 10 వేల కూలీ ఎత్తలే. బతుకమ్మ చీరలు జెయ్యవట్టి ఆడుడూపాడుతూ పనిచేసుకుంటూ నెలకు 22వేలకు పైనే సంపాదిస్తున్న. యార్న్ సబ్సిడీ పైసలు కూడా 35వేలు అదనంగా వచ్చినయ్. బ్యాంకు ఖాతాలో పైసలు 35వేలు జమైనట్లు ఇయ్యాల నాఫోన్కు మేసేజ్ వచ్చింది. ఎక్కడైనా మేం చేసిన కూలీకే సేట్లు పైసలు గట్టిత్తరు. మంత్రి కేటీఆర్ సార్ దయతోనే అదనంగా పైసలు వత్తున్నయ్. దేశంలో ఎక్కడా ఇట్ల ఇస్తలేరు. మహారాష్ట్ర, గుజరాత్లో సాంచాలు నడుపుతున్నోళ్లంతా ఇక్కడికే వత్తమంటూ ఫోన్లు సేత్తున్నరు.
– దూస గణేశ్, నేత కార్మికుడు (సిరిసిల్ల)
కేటీఆర్ చొరవతోనే మంచిరోజులు
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నేతన్నల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. రైతుల మాదిరి 5లక్షల బీమా పథకం నేతన్నలకు వర్తింప చేసింది. పొదుపు చేసుకునేందుకు త్రిఫ్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పవర్‌లూం పరిశ్రమలో పనిచేసినంతనే కూలీ చెల్లిస్తారు. నేతన్నల జీవన ప్రమాణాలు పెంచడం కోసం సీం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని అదనంగా యార్న్ సబ్సిడీ పదిశాతం ఇస్తున్నది. నేతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నందుకు జీవితాంతం నేతన్నలు రుణపడి ఉంటరు.
– గూడూరి ప్రవీణ్, టీఎస్‌టీపీడీసీ చైర్మన్