జగిత్యాల : మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న ఓ జిల్లా అధికారి లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీకి ( ACB ) చిక్కారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన వివరాలు.. జిల్లా రవాణాశాఖాధికారి ( District Transport Officer ) భద్రునాయక్ ( Badrunayak) ఈ నెల 31న రిటైర్మెంట్ కాబోతున్నారు. అయితే పట్టుకున్న జేసీబీని విడిచిపెట్టేందుకు శశిధర్ అనే వ్యక్తి అధికారిని ఆశ్రయించాడు.
ఇద్దరి మధ్య చివరకు రూ. 22 వేలు లంచంగా తీసుకునేందుకు డీటీవో అంగీకారం చేసుకున్నాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం జగిత్యాల రవాణాశాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డీటీవో వద్ద లభించిన రూ.22 వేలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.