కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 29: జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్ అవార్డుకు అల్ఫోర్స్ ఇ-టెక్నో సూల్ ప్రాజెక్ట్ ఎంపికైనట్లు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో బుధవారం విద్యార్థులు సిజారఫాత్, సిరిచందనారెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సైన్స్‌పై చాలా అవగాహన కల్పించాలన్నారు. పోటీ పరీక్షల్లో సైన్స్ అంశానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నారు. అందులో ప్రవేశపెడుతున్న పలు సంసరణలకు దీటుగా వెలువడుతున్న మార్పులకు అనుగుణంగా విద్యను బోధించాలన్నారు. పరిశోధనలకు అవకాశం ఇవ్వాలన్నారు. ప్రతి ఒకరూ వైజ్ఞానిక శాస్త్రంపై ఆసక్తిని కనబర్చడమే కాకుండా అందులో తెలిపిన విభిన్న విషయాలను విశ్లేషణాత్మకంగా తెలుసుకోవాలన్నా రు. వాటిని ఆచరణలో పెడితే అద్భుతాలకు అవకాశం ఇచ్చిన వారమవుతామని వివరించారు. ప్రాథమిక స్థాయిలో విశేష ప్రతిభను కనబరచిన సిజారఫాత్కు చెందిన చెవిటి వారికి వైబ్రేషన్లో సంకేతాలు తెలిపే పరికరం, సిరిచందనారెడ్డికి చెందిన లేజర్ లైటింగ్ పద్ధతి ద్వారా గృహ భద్రత పరికరం అందరినీ ఆకట్టుకున్నాయన్నారు. ఎంపికైన వారికి ప్రభుత్వం నగదు పారితోషికాన్ని ఇస్తుందన్నారు. వీరు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించి జిల్లా కీర్తిని వ్యాప్తి చేయాలని ఆకాంక్షించారు. పాఠశాలల ప్రిన్సిపాల్, గైడ్ టీచర్, ఉపాధ్యాయలున్నారు.