పెద్దపల్లి జంక్షన్, నవంబర్ 29: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని టీజేఏసీ జిల్లా చైర్మన్ బొంకూరి శంకర్ తెలిపారు. పెద్దపల్లిలోని రుచి గ్రాండ్ హోటల్లో గెజిటెడ్ అధికారులు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సమక్షంలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎస్టీవో ఎన్ దేవేందర్, జనరల్ సెక్రటరీగా కలెక్టరేట్ సూపరింటెండెంట్ తూము రవీందర్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎలిగేడు ఎంపీడీవో ఆర్ వేణుగోపాల్‌రావు, ఉపాధ్యక్షులుగా ఆబ్కారీ సీఐ ఎం శ్రీనివాస్, మెడికల్ అధికారి డీ రాజు, డీఏవోఎల్ బ్రహ్మానందరెడ్డి, ఎంఏవో కే అలివేణి, కోశాధికారిగా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ సీహెచ్ తిరుపతి, జాయింట్ సెక్రటరీలుగా రామగుండం ఐటీఐ ప్రిన్సిపాల్ ఈ సురేందర్, ఎలిగేడు ఎంపీవో అనిల్‌రెడ్డి, అసిస్టెంట్ కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్ ఎన్ వెంకటేశ్వర్లు, సీడీపీవో కవిత, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏహెచ్ పెద్దపల్లి డాక్టర్ కుమారస్వామి, క్రీడాసాంస్కృతిక సెక్రటరీగా కే రవికుమార్, పబ్లిసిటీ సెక్రటరీగా మంథని ఏబీసీడబ్ల్యూవో విజయ్‌పాల్‌రెడ్డి, ఈసీ మెంబర్లుగా సీఎస్‌టీవో హరీశ్, అసిస్టెంట్ కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్ ఎం శ్రీనివాస్, పెద్దపల్లి డీటీవో ఎంఏ నయీం ఎన్నికయ్యారని వెల్లడించారు. ఈ కమిటీ మూడేండ్ల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగులు కలిసి రావాలని కోరారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించి, ఎన్నికలను సజావుగా నిర్వహించిన జిల్లా ఉపాధి కల్పనాధికారి వై తిరుపతిరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజనరేందర్, గెజిటెడ్ అధికారులు పాల్గొన్నారు.