మంథని టౌన్, అక్టోబర్ 29: నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా నిత్యం కృషి చేస్తున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌ను కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తే సహించేది లేదని ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలతా శంకర్‌లాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏగోలపు శంకర్‌గౌడ్ హెచ్చరించారు. మంథనిలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వారు మాట్లాడారు. రాజకీయ కుటుంబ నేపథ్యం లేని తమ నాయకుడు పుట్ట మధూకర్ సామాన్య కార్యకర్త నుంచి జడ్పీ చైర్మన్ స్థాయికి ఎదిగారని వివరించారు. నిత్యం అభివృద్ధికి అడ్డం పడుతూ, ఫిర్యాదులతో కాంగ్రెస్ నాయకులు కా లం వెళ్ల దీస్తున్నారని పేర్కొన్నారు. కిసాన్ కాం గ్రెస్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శశిభూషణ్‌కాచే, పార్టీ మండలాధ్యక్షుడు సెగ్గెం రాజేశ్ తప్పు డు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లపై తప్పుడు ఫిర్యాదు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు.
అవినీతి చోటు చేసుకోలేదు..
మంథని సహకార సంఘంలో ఇప్పటి దాకా అవినీతి, అక్రమాలు చోటు చేసుకోలేదని విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ చెప్పారు. మంథనిలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. 30 ఏండ్ల తన రాజకీయ జీవితంలో రెండు సార్లు పుట్టపాక గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా, ఎంపీటీసీ, ఏఎంసీ చైర్మన్‌గా ఆరోపణలు లేకుండా పని చేశానని గుర్తు చేశారు. తన రాజకీయ జీవితాన్ని చూసి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ టీఆర్ఎస్లో చేరిన వెంటనే సింగిల్ విండో చైర్మన్‌గా అవకాశమిచ్చారని తెలిపారు. విండోలోని మిగులు బడ్జెట్ రూ. 40 లక్షలతో నాగారం శివారులో మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్‌మిల్లును ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టినా, రా రైస్‌మిల్లును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైస్ మిల్లు ఏర్పాటుపై ఈసీ మీటింగ్, 6 నెలలకోసారి నిర్వహించే మహా సభలో సైతం తీర్మానించామని తెలిపారు. దీంత రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు.రైస్ మిల్లు ఏర్పాటుపై కాంగ్రెస్ నాయకులు శశిభూషణ్‌కాచే, సెగ్గెం రాజేశ్ ఆరోపణలు సరికాదన్నారు.
కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్ పర్సన్ శ్రీరాంభట్ల సంతోషిణి, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు ఆకుల కిరణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బెల్లంకొండ ప్రకాశ్‌రెడ్డి, కౌన్సిలర్లు గర్రెపల్లి సత్యనారాయణ, వీకే రవి, కాయితీ సమ్మయ్య, శ్రీపతి బానయ్య, గుండా విజయలక్ష్మీ పాపారావు, టీఆర్ఎస్ నాయకులు బత్తుల సత్యనారాయణ, బెల్లంకొండ ప్రకాశ్‌రెడ్డి, అక్కపాక సంపత్, గొబ్బూరి వంశీ, వేల్పుల గట్టయ్య, కొట్టే రమేశ్, కొడారి సంపత్, కొండ రవీందర్, మాచీడి రాజుగౌడ్, మేడగోని రాజమౌళిగౌడ్ పాల్గొన్నారు.