National Space Day | జగిత్యాల: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో 2వ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వృక్ష శాస్త్ర విభాగాధిపతి, వైస్ ప్రిన్సిపాల్ జీ చంద్రయ్య మాట్లాడుతూ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు.
ఇస్రో చేపట్టిన వివిధ అంతరిక్ష ప్రయోగాలు మానవ వికాసంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని, ఈ రంగంలో ముందున్న దేశాలు ప్రపంచ భవిష్యత్తును శాసిస్తాయని, అందుకే అంతరిక్షమే హద్దుగా భారత్ ఎదుగుతోందన్నారు.ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి నిర్వహించినందుకు భౌతికశాస్త్ర విభాగాధిపతి కే రామచంద్రం కంప్యూటర్ సైన్స్ అధ్యాపకుడు సత్యం, కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం తదితరులు అభినందించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ టీ ప్రమోద్ కుమార్ అధ్యక్షత వహించగా, అధ్యాపకులు శ్రీలత, ఎండీ రహీం, వాసాల వరప్రసాద్, కుమారి నీరజ, జమున, సంగీత, ఫిజికల్ సైన్స్ విద్యార్థులు పాల్గొన్నారు.