e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 24, 2022
Home కరీంనగర్ ఊరూరా కొనుగోలు కేంద్రాలు

ఊరూరా కొనుగోలు కేంద్రాలు

ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు
అన్నదాతలకు అందుతున్న ‘మద్దతు’

చిగురుమామిడి, నవంబర్‌ 28: తెలంగాణ ప్రభుత్వం ఊరూరా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతుల తిప్పలు తప్పాయి. మెట్ట ప్రాంతమైన చిగురుమామిడి మండలంలో గోదావరి జలాలతో చెరువులు కుంటలు నిండి వరి సాగు గణనీయంగా పెరిగింది. ధాన్యం సేకరణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మండలంలోని రేకొండ, బొమ్మనపెల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్‌, నవాబ్‌ పేట్‌, సుందరగిరి, గాగిరెడ్డిపల్లె, ఓగులాపూర్‌, గునుకు ల పల్లె, రామంచ, ములనూర్‌, సీతారాంపూర్‌ గ్రామా ల్లో సింగిల్‌ విండో ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేస్తున్నారు. కేంద్రాల్లో రైతులకు కావాల్సిన వసతులు కల్పించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్‌ మిల్లులకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఆదివారం నాటికి మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా 96,774 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

రైతులు ఆందోళన చెందవద్దు
కేంద్రాలకు తెచ్చిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రైతులు ఆందోళన చెందవద్దు. వానకాలం పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. తేమశాతం వచ్చేవరకూ ధాన్యాన్ని ఆరబెట్టాలి. మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు. కేంద్రాల్లోనే విక్రయించాలి

  • వెంకటరమణారెడ్డి, చిగురుమామిడి విండో చైర్మన్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement