సారంగాపూర్, అక్టోబర్28: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డ్టాకర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ప్రజాప్రతినిధుల తో కలిసి గురువారం ఆయన 24మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, సొంత ఖర్చులతో చీరెలు అందజేశారు. అనంతరం కోనాపూర్‌లో డీఎంఎఫ్టీ నిధులు 6.44లక్షలతో రైతు భవ నం నిర్మాణానికి భూమి పూజ చేశారు. పోతారం గ్రామానికి చెందిన రైతు ఇడగొట్టు నడిపి భీమ య్య అనారోగ్యంతో మృతిచెందగా, బాధిత కుటుంబానికి 5లక్షల బీమా చెక్కును అందజేశారు. తర్వాత మండల కేంద్రంలో జాల భీమ య్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడతూ, రైతులు పంట మార్పిడి చేయాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్‌రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కోల శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు గుర్రాల రాజేంధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తోడేటి శేఖర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గురునాథం మాల్లారెడ్డి పాల్గొన్నారు.
సమాజ సేవలో ముందుండాలి
జగిత్యాల విద్యానగర్, అక్టోబర్ 28: విద్యార్థులు సమాజ సేవలో ముందుండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ శాతవాహన యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీవాణి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో జగిత్యాల బైపాస్ రోడ్డులో క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. పరిసరాల శుభ్రత, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను యువత ప్రజలకు వివరించాలన్నారు. శాతావాహన యూనివర్సిటీ ఆరో సెమిస్టర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులతోపాటు, విద్యార్థులను సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తు న్న నలంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేశ్‌ను అభినందించారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు మొగిలి రేణుక, అల్లె సాగర్, కొలగాని ప్రేమలత, గుగ్గిళ్ల హరీశ్, అనుమల్ల కృష్ణహరి, పులి శ్రీధ ర్, క్యాదాసు నవీన్, రాజు, రాంకుమా ర్, బచ్పన్ స్కూల్ కరస్పాండెంట్ నవీన్‌రెడ్డి, నలంద డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సురేశ్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ జగదీశ్వర్ పాల్గొన్నారు.