బండి.. ఓ బడా ఝూటా
నటనలో నీకు ఆసార్ ఇవ్వచ్చు
ఈటల రాజేందర్ మహా మోసగాడు
నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది
మేమూ నీ భాష వాడితే తట్టుకోలేవు
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఇల్లందకుంట, ఆగస్టు 28: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచినందుకా..? లేక మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి నందుకా..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. ఆయనో బడా ఝూటా అని, నటనలో ఆయనకు ఆసార్ అవార్డు ఇవ్వవచ్చునని ఎద్దేవా చేశారు. శనివారం ఇల్లందకుంటలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరంతోపాటు అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకొని కోటి ఎకరాలకు సాగునీరందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలను అమలు చేస్తున్నదని కొనియాడారు. కానీ, ఎంపీగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏనాడు పార్లమెంట్లో గళం విప్పని బండి సంజయ్, ఏ మొఖం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నావు అని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ హామీలు ఏమయ్యాయో.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు కల్పిస్తలేరో? చెప్పాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది? జన్ ధన్ ఖాతాలో నల్లధనం తీసుకొచ్చి 15లక్షల జమ చేశారా..? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ అన్న హామీలు ఏమయ్యాయని ఎద్దేవా చేశారు.