కరీంనగర్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) :ప్రజలు గర్వపడేలా ‘కరీం’నగరాన్ని అభివృద్ధి చేయాలని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం స్మార్ట్ సిటీ పనులపై మేయర్ సునీల్‌రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి మున్సిపల్, ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రజలు గర్వపడేలా కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతో స్మార్ట్ సిటీ మంజూరైందని తెలిపారు. ప్రజల సహకారంతో రోడ్లను వెడల్పు చేయాలని, నాణ్యతతో రోడ్లు వేయాలని, నిధులకు కొరత లేదని, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో 14.5 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఫుట్పాత్లలో పాదచారులు నడిచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని, ఇందుకు పోలీస్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేబుల్ పనుల కోసం మున్సిపల్, ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారుల అనుమతి లేకుండా రోడ్లను తవ్వి పాడుచేస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యంత్రాలతో రోడ్లను శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జనాభాకు అనుగుణంగా కూరగాయల మారెట్లు ఏర్పాటు చేయాలని, కశ్మీర్‌గడ్డ రైతు బజార్‌ను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. బస్టాండ్ వెనుక నిర్మించిన షెడ్లను కూరగాయల వ్యాపారులకు కేటాయించాలన్నారు. కళాశాల మైదానంలో చేపడుతున్న పార్ పనులను వచ్చే ఫిబ్రవరి 14లోగా పూర్తి చేయాలన్నారు. డీఎంఎఫ్టీ నిధులతో చేపడుతున్న షాదీఖాన, ఆర్అండ్బీ అతిథి గృహం, కళాభారతి ఆడిటోరియం, అంబేదర్ భవన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
గణేశ్‌నగర్, బైపాస్‌రోడ్‌లోని డ్రైనేజీ, స్మార్ట్ సిటీ రోడ్డు పనులు, అంబేదర్ స్టేడియం నుంచి కట్టరాంపూర్‌కు వెళ్లే రహదారి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్యాకేజీ 1,2,3 పనులు, డంప్‌యార్డు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. డెయిరీ ఫాం దగ్గర రెండెకరాలు, ఆర్టీసీ వర్ షాప్ దగ్గర రెండెకరాల్లో కూరగాయల మారెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. నగరం నడిబొడ్డునున్న మటన్, ఫిష్ మారెట్లను ఆధునీకరిస్తామని చెప్పారు. డ్యాం దగ్గర లేక్ పోలీస్‌స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల పొడవునా నిర్మించతలపెట్టిన వాకింగ్, సైకిల్‌ట్రాక్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసును వందశాతం, రెండో డోసును 86 శాతం పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు అధికారులను అభినందించారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్ నాయక్, డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాసరావు, ఆర్డీవో ఆనంద్‌కుమార్, మున్సిపల్ ఈఈ రామన్, డీసీపీ సుభాష్, సీపీవో కొమురయ్య, స్మార్ట్ సిటీ కన్సల్టెన్సీ అధికారులు సందీప్, ఆర్అండ్బీ ఎస్ఈ నాయక్, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్ పాల్గొన్నారు.