హిమాన్షును ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం
కరీంనగర్లో సులభ్ కాంప్లెక్స్కుప్లెక్సీ కట్టి నిరసన
తెలంగాణ చంఢాలుడు తీన్మార్ మల్లన్న’ అంటూ నినాదాలు
కొత్తపల్లి, డిసెంబర్ 27 : బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉన్నది. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును ఉద్దేశించి యూట్యూబ్‌లో బాడీ షేమింగ్ చేస్తూ పోల్ నిర్వహించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వైఖరిపై సోమవారం టీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ అభిమానులు భగ్గుమన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల అశోక్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ‘తెలంగాణ చంఢాలుడు తీన్మార్ మల్లిగాడు. అతడిది నోరు కాదు మోరి. తినేది అన్నం కాదు అశుద్ధం’ అనే నినాదాలతో ఉన్న ఫ్లెక్సీలను కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉన్న సులభ్‌కాంప్లెక్స్ గోడకు వేలాడదీసి, ‘తీన్మార్ మల్లయ్య మరుగుదొడ్డి’ అని నామకరణం చేశారు. తర్వాత ఫ్లెక్సీలో ఉన్న మల్లన్న ఫొటోను చెప్పులు, మరుగుదొడ్డిలోని చీపుర్లతో కొట్టారు. ఈ సందర్భంగా ఎడ్ల అశోక్ మాట్లాడుతూ, తీన్మార్ మల్లయ్య ప్రతి ఒక్కరి మీద నోరు పారేసుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని, ఆయన శాడిజం వల్ల రాజకీయ నాయకులు తీవ్ర మానసిక క్షోభకు గురువుతున్నారని మండిపడ్డారు. తీన్మార్ మల్లయ్యకు బుద్ధిరావాలంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరుగుదొడ్ల వద్ద ఆయన ఫ్లెక్సీలను ఉంచాలని పిలుపునిచ్చారు. నిరసనలో కార్పొరేటర్ కుర్ర తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు పిట్టల శ్రీనివాస్, గుగ్గిళ్ల శ్రీనివాస్, బొమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, బండారి సంపత్, బాలబద్రి అజయ్, పెండ్యాల మహేశ్, ఆర్ చిరంజీవి, బత్తుల రాజ్‌కుమార్, పొన్నాల రాజేశ్, అమరగొండ అశోక్, పావురపు శ్రీకర్, నీరుకుల్ల రమేశ్, రంగోజు నరేశ్, వీ అరుణ్, గాదం రాజశేఖర్, దుర్శేటి కిరణ్, కొత్తూరి సాయి, బత్తుల చందు, జాడి చంద్రశేఖర్, మేకల దినేశ్, పాము సాయన్న, అస్తపురం మారుతి తదితరులు పాల్గొన్నారు.