జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు
జెండా ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు
కార్పొరేషన్, జనవరి 26: జిల్లా వ్యాప్తంగా బుధవారం గణతంత్ర వేడుకలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆయా పార్టీల కార్యాలయాలు, సంఘాల భవనాల్లో, ప్రధాన చౌరస్తాల్లో జాతీయ జెండా ఎగురవేసి, వందనం చేశారు. కాగా, తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్, కోర్టు చౌరస్తా, క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, నాయకులు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, కలర్ సత్తన్న పాల్గొన్నారు. మేయర్ క్యాంపు కార్యాలయంలో మేయర్ వై సునీల్‌రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యాలయ సిబ్బంది ప్రకాశ్, వెంకట్రావు, అంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు. రాంనగర్లో టీఆర్ఎస్ కార్మిక విభాగం, మున్నూరుకాపు సంక్షేమ సంఘం, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్ హాజరై జెండా ఆవిష్కరించారు. ఆయా సంఘాల నాయకులు నాంచారి రాజయ్య, బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, నాగభూషణం, మొండయ్య పాల్గొన్నారు. అన్ని డివిజన్లలో కార్పొరేటర్లు జాతీయ జెండా ఆవిష్కరించారు. కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జాతీయ పతాకాన్ని ఆవిషరించారు. గాంధీ విగ్రహానికి కలెక్టర్‌తో పాటు సీపీ వీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, వారి వారి కార్యాలయాల్లో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సేవ ఇస్లావత్ జెండా ఆవిష్కరించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్పొరేషన్, జనవరి 26: ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయ ఆవరణలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ వడ్లకొండ గంగాధర్ హాజరై పలువురు ఉద్యోగులకు ఉత్తమ పురస్కారాలు అందజేశారు. ఎంఆర్టీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అమీర్‌పాషా ఉత్తమ పురస్కారం అందుకున్నారు. అమీర్పాషాను సిటీ మీటర్స్ ఏడీఈ పంజాల శ్రీనివాస్, ఏఈ లక్ష్మణమూర్తి, ఉద్యోగులు అభినందించారు.
కమాన్‌చౌరస్తా, జనవరి 26: వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల ప్రధాన కార్యాలయంలో విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి జెండా ఎగురవేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎనిమిదో డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్ సల్ల శారద-రవీందర్ జెండా ఆవిష్కరించారు. నాయకులు జాప శ్రీనివాస్ రెడ్డి, జాప రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక రెడ్డి సంక్షేమ సంఘం, మహారాజుల కాలనీ, అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ జెండా ఎగురవేశారు. పారమిత పాఠశాలలో విద్యాసంస్థల చైర్మన్ ప్రసాద్ రావు జెండా ఎగురవేశారు. డైరెక్టర్లు ప్రసూన, రశ్మి, వినోద్ రావు, రాకేశ్, అనుకర్ రావు, వీయూఎం ప్రసాద్, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. హనుమాన్ నగర్‌లోని బ్లూబెల్స్ పాఠశాలలో ప్రిన్సిపాల్ జంగ సునీత-మనోహర్‌రెడ్డి జెండా ఎగురవేశారు. మంకమ్మతోటలోని శ్రీచైతన్య పీజీ కళాశాల ప్రాంగణంలో విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాళ్లు ఎన్ సదాశివ శర్మ, శ్రీనివాస్ పాల్గొన్నారు. నగరంలోని ఫిలీం భవన్లో కఫిసొ ఉపాధ్యక్షుడు సయ్యద్ ముజఫర్ జెండా ఆవిష్కరించారు. తొడుపునూరి దశరథం, అనుముల దయాకర్, ఇనుగుర్తి రమేశ్ పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో నాయకులు కోమల్ల రాజేందర్ రెడ్డి, ఇనుగంటి మధుసూదన్ రావు, ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, పాత కాశీనాథం, నవనీరావు, విఠలాచారి, తోట ప్రదీప్, తోట రాజేందర్ పాల్గొన్నారు. ఎస్‌యూలో వీసీ ప్రొఫెసర్ మల్లేశం జెండా ఆవిష్కరించారు. రిజిస్ట్రార్ డాక్టర్ వరప్రసాద్, అసిస్టెంట్ రిజిస్టార్ ప్రసాద్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీరంగప్రసాద్, ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
రాంనగర్, జనవరి 26: పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సీపీ సత్యనారాయణ, పీటీసీలో ప్రిన్సిపాల్ సునీతామోహన్, సీటీసీలో ఏసీపీ నాగేందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్, జీ చంద్రమోహన్, ఏసీపీలు విజయసారథి, శ్రీనివాస్, మదన్‌లాల్, ప్రతాప్, పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ రవి, డీఎస్పీలు శ్రీనివాసులు, కాశయ్య, గంగాధర్, ఆలు త్రిముక్, శ్రీనివాస్, సంపత్, ఆర్ఎస్ఐ కిరణ్‌కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కోర్టు చౌరస్తా, జనవరి 26: జిలా ్లకోర్టు ఆవరణలో జడ్జి ఎంజీ ప్రియదర్శిని జెండా ఆవిష్కరించారు. న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణచౌక్,జనవరి26: కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఆర్ఎం శ్రీధర్ జెండా ఆవిష్కరించారు. డీవీఎం రవిశంకర్‌రెడ్డి, పర్సనల్ ఆఫీసర్ చంద్రయ్య పాల్గొన్నారు. ఉజ్వల పార్కు సమీపంలోని నాయీబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో నాయీబ్రహ్మణ ఐక్య వేదిక నాయకులు జెండా ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, నాయకులు జంపాల నర్సయ్య, వెంకటస్వామి, విజయ్‌కుమార్, రమేశ్ పాల్గొన్నారు. సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి జెండా ఎగుర వేశారు. జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, కార్యవర్గ సభ్యులు టేకుమల్ల సమ్మయ్య, మణికంఠరెడ్డి, నగర అధ్యక్షుడు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బూడిద సదాశివ పాల్గొన్నారు. లేబర్ అడ్డాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ జెండా ఎగురవేశారు. నాయకులు రవి, రాజు పాల్గొన్నారు. ఆర్టీసీ వర్క్‌షాపు వద్ద కరీంనగర్ బ్లేడ్ అండ్ ప్లవర్ ట్రాక్టర్స్ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం పాల్గొని జెండా ఎగురవేశారు. నాయకులు చంద్రమౌళి, శ్రీనివాస్, అజయ్, గణేశ్, హన్మాండ్లు పాల్గొన్నారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్ జెండా ఆవిష్కరించారు. నాయకులు ఆనందరావు, ప్రభాకర్ పాల్గొన్నారు.
విద్యానగర్, జనవరి 26: జిలా ్లకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల జెండా ఆవిష్కరించారు. ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి, డాక్టర్లు నవీన, పద్మ, చంద్రశేఖర్, గంగాధర్ పాల్గొన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జువేరియా జెండా ఆవిష్కరించారు. డీఐవో సాజిదా, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌రెడ్డి, డీటీసీవో రవీందర్‌రెడ్డి, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ శరణ్య జెండా ఆవిష్కరించారు. కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి, ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు. 38వ డివిజన్లోని బీరప్పనగర్, సంతోషినగర్, శ్రీహరినగర్‌లో కార్పొరేటర్ కచ్చు రవి జెండా ఆవిష్కరించారు. 19వ డివిజన్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్ హాజరై జెండా ఆవిష్కరించారు. 41వ డివిజన్లోని వావిలాలపల్లి డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అధ్యక్షుడు వంగ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ బండారి వేణు, దొడ్ల అనంతరెడ్డి, ర్యాకం వీరన్న, అరవింద్, లింగయ్యపటేల్, గొట్టెముక్కల శరత్, ఆకుల చంద్రయ్య, బొద్దుల లక్ష్మయ్య, స్వర్గం చంద్రమౌళి, బిట్టు, లక్ష్మీరాజం, వెంకటేశం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. హుస్సేనిపురలోని కరీంనగర్ వెల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సంఘం అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ గని, టౌన్-1 ఏఈ వెంకటరమణ, సభ్యులు మీర్జా అజ్మత్ అలీ బేగ్, మహ్మద్ అబ్దుల్ జమీల్, రఫీ, సయ్యద్ మొహిజ్, సాధిక్, యూనిస్, షేక్ గౌస్‌పాషా, బియాబానీ పాషా పాల్గొన్నారు. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్‌లో అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్ జెండా ఆవిష్కరించారు. బ్యాంక్ కార్యవర్గ సభ్యులు కర్ర సూర్యశేఖర్, మున్ననూర్ చంద్రశేఖర్‌రావు, ఎడబోయిన శ్రీనివాస్‌రెడ్డి, సీఈవో శ్రీనివాస్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, జనవరి 26: పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రాంరెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రమేశ్, తుమ్మనపల్లి, జూపాక, హుజూరాబాద్ సింగిల్ విండో కార్యాలయాల్లో చైర్మన్లు కౌరు సుగుణాకర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు, పొదుపు సంఘాల్లో అధ్యక్షులు, సింగాపూర్ కిట్స్, వీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్స్ కందుకూరి శంకర్, హనుమకుమార్, ఏకశిల పాఠశాలలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండా ఆవిష్కరించారు.