e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home కరీంనగర్ గంజాయికి యువత బానిస కావద్దు

గంజాయికి యువత బానిస కావద్దు

ఏసీపీలు నరేందర్‌, మహేశ్‌
బెల్లంపల్లిరూరల్‌, అక్టోబర్‌ 25: గంజాయికి యువత బానిస కావద్దని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్‌ కోరారు. మండలంలోని మాలగురిజాల గ్రామంలో బెల్లంపల్లిరూరల్‌ సర్కిల్‌ పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలనపై సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ.. యువత గంజాయి మత్తులో నేరాలు చేస్తూ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలన్నారు. అనంతరం గ్రామంలో పెద్దలతో గంజాయి నిరోధక కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లిరూరల్‌ సీఐ కే జగదీశ్‌, తాళ్లగురిజాల ప్రొబేషనరీ ఎస్‌ఐ గంగాధర్‌, మాలగురిజాల సర్పంచ్‌ అశోక్‌కుమార్‌, ఎంపీటీసీ శకుంతల పాల్గొన్నారు.
శ్రీరాంపూర్‌, అక్టోబర్‌ 25: గంజాయి రహిత రాష్ట్రంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ, యువత తల్లిదండ్రులు సహకరించాలని జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ కోరారు. శ్రీరాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో యువకులకు, వారి తల్లిదండ్రులకు శ్రీరాంపూర్‌ ఎస్‌ఐ మంగీలాల్‌ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఏసీపీ నరేందర్‌, సీఐ బీ రాజు మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనించాలని కోరారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్‌ ఎస్‌ఐ సౌజన్య పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement