కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
106 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
మెట్‌పెల్లి టౌన్, ఆగస్టు 25: అడగకుండా వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మెట్‌పెల్లిలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన 106మంది లబ్ధిదారులకు రూ.కోటి 6లక్షల 12వేల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బుధవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఇక్కడ రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
సీసీ కెమెరాలు ప్రారంభం
మెట్పల్లి రూరల్, ఆగస్టు 25: మెట్పల్లి మం డలం వెల్లుల్ల గ్రామంలో పంచాయతీ నిధులు రూ.7.50 లక్షలతో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు రజిని, ఎంపీపీ మారు సాయిరెడ్డి, సీఐ శ్రీనివాస్, ఉప సర్పంచ్ క్యాతం లింగారెడ్డి, వార్డు సభ్యులు సుద్దాల రాకేశ్, పన్నాల నవీన్, దండె రాకేశ్, బొబ్బిలి రాజయ్య నాయకులు గూడూరి తిరుపతి, జుంగుల మారుతిగౌడ్, కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.