రామగిరి, అక్టోబర్ 24: ప్రతి కార్యకర్త నూతనోత్సాహంతో పని చేస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శెంకేసి రవీందర్ పిలుపునిచ్చారు. స్థానిక సాయిరాం గార్డెన్స్‌లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంథనిలో ఈ నెల 27వ తేదీన జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశం, వరంగల్‌లో వచ్చే నెల 15న జరిగే సమావేశాలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొంరయ్య, జడ్పీటీసీ మాదరవేన శారదాకుమార్, సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, మాజీ జడ్పీటీసీ గంట రమణారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు కొండవేన సుధాకర్, బీసీ సెల్ అధ్యక్షుడు బుద్ధె ఉదయ్, ఇల్లందుల సంజీవ్, ఆశ కుమారి, సుభాన్, బర్ల కుమార్, పాశం ఓదెలు, ధర్ముల రాజ సంపత్, దామెర శ్రీనివాస్, సర్పంచులు అల్లం పద్మ తిరుపతి, పల్లె ప్రతిమ, బడికెల విజయ శ్రీనివాస్, కొండవేన ఓదెలు, నాగరాజు, బుర్ర పద్మ శంకర్, ఎంపీటీసీలు కరుణ కుమారస్వామి, మేడగోని ఉమ రాజయ్య, కామ శ్రీనివాస్, సుకన్య రవీందర్, కొండ శ్రీనివాస్, గౌతం శంకరయ్య, దేవ శ్రీనివాస్, కాపురబోయిన భాస్కర్ ఉన్నారు.
సైనికుల్లా పని చేయాలి
కమాన్‌పూర్, అక్టోబర్ 24: టీఆర్ఎస్ కార్యకర్తలు బార్డర్లో సైనికుల్లా పని చేసి మరో మారు పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఆదివరాహస్వామి ఆలయ ప్రాంగణంలోని కల్యా ణ మండపంలో పార్టీ మండల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అనేక ప్రజా, రైతు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి వందలాది పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టత కోసం శాయశక్తులా కృషి చేయాలాని కోరా రు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్‌రావు, ఆదివరాహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఇనగంటి ప్రేమలత, పార్టీ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, సర్పంచులు బొల్లపెల్లి శంకర్‌గౌడ్, తాటికొండ శంకర్, కొండ వెంకటేశ్, ఎంపీటీసీలు కోలేటి చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఇంతియాజ్, మాజీ జడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ పొనగంటి కనకయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిందం తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి దామెర సంపత్, మండల అధికార ప్రతినిధి పెండ్లి నారాయణ, బీసీ, ఎస్సీ, మైనార్టీ, మీడియా సెల్ అధ్యక్షులు నడిగొట్టు సంపత్, గొడిసల స్వామి, ఎండీ అమీర్, సాన సురేశ్, మండల ఉపాధ్యక్షులు బొల్లపెల్లి లక్ష్మయ్య గౌడ్ తదితరులున్నారు.
ముత్తారంలో..
ముత్తారం, అక్టోబర్ 24: మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముత్తారం ఎంపీపీ జక్కుల ముత్తయ్య, ఆర్బీఎస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అత్తె చంద్రమౌళి, కిషన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ సూదాటి రవీందర్రావు, సర్పంచ్ నూనె కుమార్ పాల్గొన్నారు.