సిరిసిల్ల టౌన్, అక్టోబర్24: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవిం చి ఇరువై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో వచ్చే నెల 15న నిర్వహించే విజయగర్జన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి అధ్వర్యంలో టీఆర్ఎస్ నూతన పట్టణ శాఖ, అనుబంధ సంఘాల అభినందన సభ, టీఆర్ఎస్ విజయగర్జన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుడూరి ప్రవీణ్, జిల్లా ఇన్చార్జి తోగ ఆగయ్య, సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ కన్వీనర్ గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలన్నారు. పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి కార్యకర్తకూ మంత్రి కేటీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఇందుకు నిదర్శనమని చెప్పారు. నాయకులు కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విధేయులుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. పార్టీ పదవుల కేటాయింపులోను అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. మహిళా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
అధిక సంఖ్యలో తరలించాలి
నవంబర్ 15న వరంగల్లో జరుగనున్న విజయగర్జన సభకు ప్రజలను అధిక సంఖ్యలో తరలించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని వార్డు కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలతో కలిసి సభకు తరలిరావాలని కోరారు. పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేసి అధిక సంఖ్యలో జనసేకరణ చేసి విజయగర్జన సభను సక్సెస్ చేయాలని కోరారు. సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బైరి ప్రభాకర్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ అగ్గి రాములు, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు కొమిరె సంజీవ్గౌడ్, ఎండీ సత్తార్, రాంచంద్రం, మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ, కొల్లి రామ్మోహన్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.