Minister Duddilla Sridhar Babu | మంథని, జనవరి 1 : రాష్ట్ర ప్రభుత్వ ధూప దీప నైవేధ్య పథకంలో మంథని నియోజకవర్గం లోని 24 ఆలయాలను రాష్ట్ర దేవాదాయ శాఖ చేర్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వీటిలో రామగిరి మండలం పన్నూరు శ్రీ శివ వీర బ్రహ్మేంద్ర ఆంజనేయ స్వామి దేవాలయం, రత్నాపూర్ శ్రీ కోదండ రామాలయం, వకీల్ పల్లి లోని శ్రీ అభయాంజనేయ ఆలయ, ముస్త్యాల శ్రీ అభయాంజనేయ ఆలయాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అలాగే మంథని మండలం చిన్న హోదాల మర్రిపాడు ఆంజనేయ స్వామి, మంతయంలోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయం, మల్లారంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం, నాగారంలోని శ్రీ కోదండ రామాలయం, గంగాపూర్ లోని శ్రీ భక్త మల్లెల హనుమాన్ ఆలయం, వెంకటాపూర్ లోని శ్రీ అభయాంజనేయ ఆలయం, బెస్తపల్లిలోని శ్రీ అభయాంజనేయ ఆలయం, ఏ క్లాస్ పూర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, సిరిపురం లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, గుంజపడుగులోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, మంథనిలోని శ్రీ అభయాంజనేయ ఆలయాలు ఉన్నట్లు తెలిపారు.
కమాన్పూర్ మండలం గుండారంలోని శ్రీ భక్తాంజనేయ ఆలయం, కాటారం మండలం లోని కొత్తపల్లి శ్రీ అభయాంజనేయ ఆలయం, ఒడిపిలవంచ శ్రీ భూ నీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం, అంకుస్తాపూర్ లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం, జగ్గయ్యపల్లి శ్రీ అభయాంజనేయ ఆలయం, దామరకుంట శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం, మహాదేవ పూర్ మండలం బొమ్మపూర్ శ్రీ హనుమాన్ శివ పంచాయతన్ ఆలయం, కుదురుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, ఎలికేశ్వరం శ్రీ అలకేశ్వర స్వామి ఆలయాలు ఈ పథకంలో చేర్చినట్లు మంత్రి పేర్కొన్నారు.